ద్వారక..ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు పాలించిన మహానగరం..ఇది యాదవుల రాజధాని..అనంత సామ్రాజ్యంలో ఒక నగరం ద్వారకా..ఒక సముక్త రాజ్య సమాహారం ఇది..అంధకులు, మృస్టులు,భుజలు ఈ రాజ్య సమహారంలో ముఖ్యులు..ఈ ద్వారకను పాలించిన వారిలో యాదవులు, దశరాస్, మధవులు..ఇక్కడ ఉన్న ముఖ్యమైన వారిలో దశరధుడు,శ్రీకృష్ణుడు, బాలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్దవుడు, అకృరుడు, ఉగ్రశేనుడు…మొత్తం కలిపి అందమైన ఒక ద్వారకా మహానగరం..ఇది ఇప్పుడు సముద్రగర్భంలో ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనావాళ్లు ఎన్నో ఇప్పటికీ అక్కడ పదిలంగానే ఉన్నాయి..వేల సంవత్సరాల క్రితమే ఈ నగరం జన సముదాయంతో వెలిగిపోయే ద్వారకా కాలంతో పాటు ఇది కూడా సముద్రగర్భంలో కలిసి పోయింది..అసలు ఈ ద్వారక నగరం మిస్టరీ ఏంటీ? ఎందుకు ఇది సముద్రంలో మునిగిపోయింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉంది..ఈ నగరం నిర్మాణానికి పునాది ఏంటీ అన్నది పురాణాల ప్రకారం చూస్తే…జరాసంధుడు శ్రీకృష్ణుడికి వ్యతిరేకి..కృష్ణున్ని ఒడించాలని తరచూ మధురనగరం పై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు..మధుర నగరంలో జరుగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది ప్రజల్ని చూసి కృష్ణుడు చలించిపోతాడు..తన బిడ్డల కష్టాలను చూడలేక..జరాసంధుడి నుండి వారి ప్రాణాలను రక్షించటం కోసం కృష్ణుడు సముద్రం మధ్యలో ఒక నగరం నిర్మించాలని నిర్ణయించుకుంటాడు..దీంతో జరాసంధుడి బాధ నగరవాసులకు ఇక ఉండదు అని భావించాడు కృష్ణుడు..అనుకున్న వెంటనే విశ్వకర్మను పిలిపించి మధుర నగర ప్రజల కోసం సురక్షితమైన నగరాన్ని నిర్మించారని చెబుతారు. అలాగే ఆ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుని కూడా శ్రీకృష్ణుడు కొరతాడు..దీంతో 12యోజనాల భూమిని అంటే దాదాపు 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సముద్రుడు ఇస్తాడు..అదే గోమతి నది సముద్రంలో కలిసే ద్వారకా..విశ్వకర్మ ఎంతో అందంగా ఈ నగరాన్ని నిర్మించాడు.దాదాపు 9లక్షల అందమైన రాజభవనాలు..నగరంలోకి అడుగుట్టాలంటే బంగారు ద్వారాలని దాటివెల్లాలి.అంతేకాదు బంగారు..వజ్రాలు.. రత్నాలతో అక్కడ భవనాల గోడలపై శ్రీకృష్ణునికి సంబంధించిన వివిధ రకాల సన్నివేశాల్ని బంగారు పూతతో శిల్పాలుగా చెక్కి ఉంచారట..
శ్రీ కృష్ణుడికి 16000 మంది గోపికలు, 8మంది భార్యలు, 80 మంది పిల్లలు..చెరసాలలో పుట్టి..బేజియో, టోక్యో, ముంబయ్ వంటి మెట్రోపొలిటిన్ సిటీలకు తలదన్నే విధంగా 3600 ఏళ్ల క్రితమే ద్వారకను నిర్మించిన శ్రీకృష్ణుడు ఎందుకు చనిపోయాడు..? కృష్ణుడు ద్వారకను వదిలి ఏకాంతంలోకి ఎందుకు వెళ్లాలనుకున్నాడు..? యుగానికే అవతార పురుషునికి శాపాలు పనిచేస్తాయా? లేక కావాలనే కృష్ణుడు తనువు చలించాడా..? అంటే..ఇవన్నీ మిస్టరీ గానే చెప్పవచ్చు..ఎంతో కష్టపడి తన బిడ్డలను కష్టాలపాలు చేయటం ఇష్టం లేక..కష్టాన్ని దిగమింగి సముదృడి సహాయంతో నిర్మించిన మహానగరంలో కొన్నాళ్ళ తర్వాత ముసలం ప్రారంభమైంది..నేను పెద్ద అంటే నేను పెద్ద అంటూ అధికార దాహం కోసం గొడవలు మొదలయ్యాయి..వారు కృష్ణుడి మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా…వారిలోవారు కొట్టుకోవటం మొదలుపెట్టారు..దీంతో శ్రీకృష్ణుడు బాధతప్త హృదయంతో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది..దీంతో ఏకాంతంగా అడవిలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు..అక్కడ తిరిగి సముద్రుడు ప్రత్యేక్షమైతే తనవారి బాగోగుల కోసం నిర్మించిన ద్వారకా కారణంగానే తన అనుకున్నవాళ్లు మరణిస్తున్నారని..కొట్టుకుంటున్నారని ద్వారకా అనే నగరమే లేకుంటే బాగుండేదని బాధపడటం సముద్రుడు దానికి అంగీకరించటం జరిగి ఉంటుందని భిన్నభిప్రాయాలూ లేకపోలేదు..అదే క్రమంలో వేటకు వచ్చిన వేటగాడు జింకపై బానం వేయబోయి,.. అది శ్రీ కృష్ణుడికి తగలటం వల్ల కృష్ణుడు ప్రాణాలు వదులుతాడు..శ్రీకృష్ణుడు ప్రాణాలు వదిలిన వెంటనే ద్వారకను సముద్రుడు ముంచేస్తాడు..ఇవన్నీ ఇలా ఉంటే మన పురాణాల ప్రకారం ద్వారకా ముంపుకు గల కారణాలంటీ? అనే విహాషయాలపై ఇప్పడు చర్చిద్దాం..అందులో మొదటిది..

గాంధారి శాపం..
ఇంతటి ప్రతిష్టాత్మక నగరానికి పెను ముప్పు వచ్చింది..కురుక్షేత్ర మహా సంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలోంచి వినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడకు శ్రీ కృష్ణుడు, పాండవులు వెళతారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి..శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం అయిన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది. నీ తల్లి దేవకిని అడిగితే తెలుస్తుంది కడుపుకోత అంటే ఏంటో తెలుస్తుందంటూ శోకాలు పెడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్విన కృష్ణుడు..అందుకు సమాధానంగా ఇలా అంటాడు.”తల్లీ నీ భర్త దృతరాష్ట్రుడు పూర్వ జన్మలో ఒక హంస.. అయితే ఆ హంస పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశారు..దాని ఫలితమే దృష్టిని కోల్పోవటం..ఇది అయన ఖర్మ ఫలం..ఖర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు కదా అంటాడు..ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడిని హెచ్చరించానని సమాధానం చెబుతాడు. అప్పటికీ ఆమెలో ఆగ్రహం చల్లారదు..నాకున్న విష్ణు భక్తి నిజమైతే..నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే..ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్ల కి నువ్వు మరణిస్తారవని శాపం ఇస్తుంది. అంతే కాదు..యాదవులంతా కొట్టుకు చనిపోతారు..ద్వారక నీట మునిగిపోతుందంటుంది. అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు..ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుంది..కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు..ద్వారకను 36 ఏళ్లు మాత్రమే పాలించాడు..ద్వారకా మళ్ళీ సముద్రమట్టం అవుతుందని ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు, అర్జునిడితో కూడా చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి..
ఇక రెండవది..ముసలం..
కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారక చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడు- జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఓ సారి శ్రీ కృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వచ్చిన సప్తరుషులను ఆటపట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్తర్షులు.. యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి..వెనక్కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు..ఇది జరగక తప్పదు అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. కానీ గాంధారి శాపం, మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు కదా…
రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణం మారిపోయింది. ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలెట్టాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవడం…పగలు మేకలు నక్కల్లా అరవడం , ఆవులకు గాడిదలు, ముంగిసలకు ఎలుకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకర్నొకరు హింసించుకోవడం మొదలెట్టారు. స్త్రీలు సిగ్గువిడిచి సంచరించారు.. అప్పుడే వండిన ఆహార పదార్థాల్లోంచి పురుగులు వచ్చాయి.ఎక్కడ చూసినా అశుభ సూచనలే…ఇక గాంధారి , సప్తర్షుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని కృష్ణుడికి అర్థమైంది..సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమం అని భావించిన కృష్ణుడు..జాతరకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చాడు. అవసరమైనా ఆహార పదార్థాలు తీసుకుని జాతరకు వెళ్లారు ద్వారక వాసులు. అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్లిపోతాడు. రాజు అయిన కృష్ణుడి ఎదురుగానే పానీయాలు సేవించడం, వాదనలకు దిగడం మొదలుపెట్టారు. ప్రద్యమ్నుడు , కృతవర్మ, సాత్యకి వీళ్లంతా ఒకర్నొకరు ఎగతాళి చేసుకున్నారు. వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేశాడు సాత్యకి… సముద్రతీరంలో మొలిచిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించి ఉంది..ఆ తుంగలోనుండి తీసిన కత్తి అది..కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగానే తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని ప్రాణాలు విడుస్తారు.
మూడవది ద్వాపర యుగాంతం..
ప్రాణాలతో మిగిలిన దారుకుడూ, బభ్రుడిని తీసుకుని బలరాముడు వెళ్లిన మార్గంలోనే కృష్ణుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణావతారం చాలించడం జరిగింది. విచిత్రమేమిటంటే..రోకలిని పిండిచేసి ముక్కలను సముద్రంలో కలపగా ఆ ముక్కలను ఒక చేప మింగేయటం..ఆ చేప వేటగాడి గాలానికి పడటం..ఆ చేప కడుపులో ఉన్న ముక్కలతో వేటగాడు భానాన్ని తయారు చేయటం అదే బానం తో శ్రీకృష్ణుడు మరణించటం అన్నీ ఆశ్చర్యంగా జరిగిపోయాయి..కృష్ణుడి మరణానంతరం ద్వారక నీటమునిగి ద్వాపరయుగం అంతం కాగా..కలియుగం ఆరంభమైందని పురాణాలు చెప్తాయి..

ఇది ఇలా ఉంటే మన దేశంలో పురావాస్తు శాస్త్రవేత్తలు సైతం అక్కడ ద్వారకా నగరం ఉందని చెబుతూ ఉన్నారు.ముఖ్యంగా డాక్టరేట్ అఫ్ లిక్టేచర్ చేసిన డాక్టర్ S.R Rao మన దేశంలో ప్రముఖ అర్కియాలాజిస్ట్..ఆయన చెప్పిందాని ప్రకారం..ద్వారకలోని northside ఉన్న ఒక ద్వారం దగ్గర పరిశీలించి చూస్తే..అది 1528 BCE (before common era) లో నిర్మించినట్లు తెలుస్తోంది..ఇదిలా ఉంటే 1983లో Dr.SR RAO మెరీన్ అండర్ వాటర్ లో తవ్వకాలు మొదలు పెట్టాడు..
SR రావు నేతృత్వంలోని తన బృందం గుజరాత్లోని ద్వారక తీరంలో సముద్రపు అడుగుభాగంలో ఒక అందమైన మెట్రో పొలిటిన్ సిటీలను సైతం తలదన్నే అద్భుతమైన నగరాన్ని కనుకొన్నారు..దాన్నే ద్వారకగా చెప్పుకొచ్చారు. దీంతోపాటు అక్కడ ఆశ్చర్యపరిచే పురావస్తు వస్తువుల సమాహారం..అందమైన భవంతులు కృష్ణుడి భార్యలతో పాటు 16000 మంది గోపికలకు సైతం బంగారం రత్నలతో కూడిన పెద్ద పెద్ద భవంతులు, గార్డెన్స్..వంటివి కనిపించాయి..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలోని మెరైన్ ఆర్కియాలజీ యూనిట్లో ఎమెరిటస్ సైంటిస్ట్ SR రావు గుజరాత్లోని ఓడరేవు, నగరం లోథాల్తో సహా పెద్ద సంఖ్యలో హరప్పా ప్రదేశాలను త్రవ్వారు. దాదాపు 3600 సంవత్సరాల పూర్వం ఈ ద్వారకా నిర్మించినట్లు వారు కనుకొన్నారు..
ద్వారకాలో ఉన్న గోడలు సైతం బంగారంతో తయారు చేసినట్లు కనుకొన్నారు శాస్త్రవేత్తలు..ఇందులో ఎర్రకోట, కొన్ని అద్భుత ఖాలాకండాలు,శాసనాలు, సముద్రంలో తవ్వేకొద్ది ఎన్నో కొత్తవిషయాలు పరిశోదనల్లో బయటకు వచ్చాయి.అంతేకాదు ఈ నగరం గోల్డెన్ సిటీ గా అలలారింది..నో డౌట్..రామాయణ కాలంలో రావణుడికి ఎయిర్పోర్టులు ఉన్నట్లు..అంతకు మించి ద్వారకాలో ఉన్నట్లు తెలుస్తోంది..ఇవన్నీ కూడా భారత దేశంలో వేల ఏళ్లనాడే అపూర్వ నాగరికత ఉందన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే భూగర్భలో నిక్షప్తమైన నగరం ఈ ద్వారకా…





