ఇదొక ఔట్‌బ్రేక్ షాక్..ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో ఒక కొత్త కీటక వ్యాధి నిశ్శబ్దంగా పంజా విసురుతోంది. ఇది డెంగీ కాదు, మలేరియా కాదు…కానీ అంతకంటే ప్రమాదకరం.
పేరు —స్క్రబ్ టైఫస్. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే 36 ఏళ్ల మహిళ… కొన్ని రోజులుగా తగ్గని జ్వరంతో పోరాడుతూ… సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేసింది. కానీ అదే నిర్లక్ష్యం ఆమె ప్రాణాన్ని తీసింది. ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయగా, ఆమె శరీరంలో స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా… గంట గంటకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ… చివరికి చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలింది. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది… రాష్ట్రవ్యాప్త కేసుల ఉద్ధృతి అధికార లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటికే దాదాపు 1500కి పైగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయ్యాయి. ఒక కీటకం కుట్టినంత మాత్రాన ఇంతటి విలయం సృష్టిస్తుందా అని అంతా ఆశ్చర్యపోతుండగా… వైద్య శాఖ వెల్లడించిన మరో బాంబు షెల్ లాంటి నిజం ఏంటంటే —అధికారికంగా మొత్తం 1317 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 379, కాకినాడ 141, విశాఖ 123, కడప 94, నెల్లూరులో 86 నమోదయ్యాయి..ఇలా రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందినట్టు తెలియడంతో… ప్రజల్లో భయం పెరిగిపోతోంది. ఇప్పటికే దాదాపు 5మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి..
గ్రామం నుంచి నగరం వరకు… ఎక్కడా మినహాయింపు లేదు. ఈ వ్యాధి ఇప్పుడు సాధారణ పురుగు కాదు… సైలెంట్ పాండమిక్ సృష్టించే కొత్త భయంగా మారింది.అసలు ఈ పురుగు ఏంటి? ఎలా సోకుతుంది? అంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిని వ్యాపింపజేసేది సాధారణ దోమ కాదు… చిగ్గర్ మైట్ అనే సూక్ష్మ కీటకం. ఇది ప్రధానంగా పొదలు, గడ్డి, వ్యవసాయ పొలాలు, అడవుల దగ్గర ఉండే ప్రదేశాల్లో జీవిస్తుంది. ఇది కుట్టినప్పుడు మన రక్తంలోకి ఒక భయంకర బ్యాక్టీరియా ప్రవేశించి శరీరాన్ని లోపలి నుంచి అటాక్ చేస్తుంది. బాహ్యంగా చిన్న గాటు మాత్రమే కనిపించినా… లోపల మాత్రం ఇది శరీర రక్షణ వ్యవస్థను బ్రేక్ చేస్తూ… కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి… సరైన చికిత్స ఆలస్యం అయితే నేరుగా ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది..స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏంటంటే..ఈ కీటకం కుట్టిన 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడుతుంటాయి.
🔥 తగ్గని తీవ్ర జ్వరం🔥 ఒళ్లంతా వణుకు, ఒంటి నొప్పులు🔥 కళ్లలో మంట, ఎర్రబడటం🔥 చర్మంపై దద్దుర్లు🔥 పురుగు కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ🔥 వాంతులు, తల తిరగడం, నీరసం🔥 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..ఇదే పరిస్థితి తీవ్ర దశకు చేరుతోందని సంకేతం..ఈ లక్షణాలు సాధారణ జ్వరం లాగానే మొదలైనా… అకస్మాత్తుగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది. వ్యాధి నయం అవుతుందా? అంటే షాక్ కలిగించే విషయం ఏంటంటే — సరైన సమయంలో గుర్తిస్తే స్క్రబ్ టైఫస్ సాధారణ యాంటీబయాటిక్స్ తో 3–7 రోజుల్లోనే పూర్తిగా నయం చేయవచ్చు. కానీ ప్రజలు మొదట వచ్చే జ్వరాన్నే సాధారణంగా భావించి… పరీక్షలు ఆలస్యం చేస్తుండటంతోనే… ఇది ప్రాణాంతక దశకు వెళ్తోంది. అందుకే ఇటు అధికారులు అటు ప్రభుత్వం హెచ్చరికాలు ఝరి చేసింది..జ్వరం కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయొద్దు… రక్త పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండంటూ చెప్తున్నారు..నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనే టెన్షన్ ఏపీ ప్రజల్లో నెలకొంది..ఎందుకంటే..ఇప్పటి వరకు నమోదైన 1317 కేసులు కేవలం పరీక్షల ద్వారా బయటపడ్డవే.
📌 ఇంకా పరీక్ష చేయించుకోకుండా ఇంట్లో తగ్గిపోతుందని ఎదురుచూస్తున్నవారు ఎన్ని వేలమంది?📌 పొదలు ఎక్కువగా ఉన్న రూరల్ ఏరియాలో ఈ పురుగుల సంఖ్య మరింత పెరుగుతోందా?📌 ఈ వ్యాధి నగర ప్రాంతాల్లోకి అంతకంతకూ బలంగా ప్రవేశిస్తోందా?ఇవే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు కాదు… ప్రజల ముందున్న నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రశ్నలు..వైద్య శాఖ ఇప్పుడు ఒక ప్రత్యేక సర్వే ప్రారంభిస్తోంది.
🔎 పొదలు, వ్యవసాయ ప్రదేశాల దగ్గర చిగ్గర్ మైట్ పాప్యులేషన్ స్టడీ🔎 రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు🔎 ఫీవర్ కేసులు ఉన్న ప్రతి గ్రామంలో డోర్ టూ డోర్ స్క్రీనింగ్🔎 ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్క్రబ్ టైఫస్ కిట్ల సంఖ్య పెంపు…..కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… వ్యాధి పెరుగుతోందా? లేక ప్రజలు పరీక్షలు ఎక్కువగా చేయించుకుంటుండటంతో కేసులు బయటపడుతున్నాయా? అనే దానిపై కూడా… వైరల్ చర్చ నడుస్తోంది.అసలు ప్రజలు భయపడాలా? జాగ్రత్త పడాలా? అంటే దీనికి స్పష్టమైన సలహా భయపడడం కన్నా ముందే జాగ్రత్త పడడం ముఖ్యం…
✔ పొదలు, గడ్డి ఏరియాలో తిరిగినప్పుడు ఫుల్ స్లీవ్స్ దుస్తులు ధరించాలి✔ కాళ్లకు షూస్, సాక్స్ తప్పనిసరి✔ రాత్రి వేళల్లో పొలాలు/పొదల దగ్గర నడక తగ్గించాలి✔ పురుగు కుట్టిన మచ్చ, నల్లటి డాట్ కనిపిస్తే అది ఎస్చార్ కావచ్చు — వెంటనే డాక్టర్‌కు చూపించాలి✔ జ్వరం ఉంటే CBC, LFT, Scrub Typhus IgM పరీక్షలు తప్పనిసరి.





