టెంపుల్ సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది..తిరుపతిలోని ప్రముఖ రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. “ఫోర్ ఆర్డీఎక్స్ బాంబులతో హోటల్‌ను పేల్చేస్తాం” అంటూ గుర్తుతెలియని దుండగులు పంపిన థ్రెట్ మెయిల్ ఇప్పుడు సంచలనంగా మారింది.. ఇది సెలబ్రిటీలు, టూరిస్టులు ఎక్కువగా బస చేసే స్టార్ హోటల్ కావడం ఒకవైపైతే ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న ప్రదేశం కావటంతో ఈ వార్త క్షణాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది.
బెదిరింపు మెయిల్లో ఉపయోగించిన భాష, టోన్ చూస్తే.. ఇది మామూలు వార్నింగ్ కాదు.. ప్లాన్డ్ ప్రెజర్ టాక్టిక్ అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. “బాంబులు లోపలే ఉన్నాయి.. కౌంట్‌డౌన్ మొదలైందంటూ” పంపిన ఆ మెయిల్లో.. 4 RDX పేలుడు పదార్థాలు అమర్చినట్టు పేర్కొన్నారు. ఇది నిజమా..? కేవలం భయాందోళన సృష్టించే మెయిల్ మాత్రమేనా..? అనే దానిపై ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా సాగుతోంది.మేయిల్ అందిన వెంటనే టెంపుల్ సిటీకి సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లపై.. ముఖ్యంగా రాజ్ పార్క్‌తో పాటు, చుట్టుపక్కల లాడ్జీలు, రెస్టారెంట్లు అన్నింటిలో పోలీసులు బర్నింగ్ లైట్ తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ టీమ్స్‌తో అణువణువు సోదాలు సాగుతున్నాయి. ప్రతి రూమ్, ప్రతి ఫ్లోర్, ప్రతి కారిడార్‌ను అత్యాధునిక డిటెక్టర్స్‌తో చెక్ చేస్తున్నారు.ఈ ఘటనతో హోటల్ సిబ్బందిలో_tension peaks_లోకి చేరింది.. అదే సమయంలో టూరిస్టుల్లో కూడా గుబులు మొదలైంది.. అయినప్పటికీ.. ప్రజలు, ప్రయాణికులు కంగారు పడవద్దని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇది థ్రెట్ మాత్రమే, భద్రతకు ఎలాంటి లోటు లేదు అంటూ హోటల్‌ను తాత్కాలికంగా పూర్తి పోలీస్ అధీనంలో తీసుకున్నారు.
ఈ బెదిరింపు వెనుక సైబర్ ట్రాక్ ఉందా..? అజ్ఞాత గ్రూప్ కుట్రనా..? వ్యక్తిగత ప్రతీకార కోణమా..? అనే అన్ని యాంగిల్స్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మెయిల్ పంపిన IP అడ్రస్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా సైబర్ సెల్ రంగంలోకి దిగింది. ఆలయం.. పైగా ఆధ్యాత్మిక నగరం కావటంతో ఈ సంఘటనను మరింత సీరియస్ గా తీసుకున్నారు అధికారులు..ఈ కేసులో ఒక్క క్లూ దొరికినా..పెద్ద గ్యాంగ్‌ను ఛేదించటమే కాకుండా..ఇది ఎందుకు చేశారు..? ఏమైనా అక్కతాయిల పనేనా? అనే కోణంలో అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు..





