ముఖేష్ అంబానీ..ఇతని ఫ్యామిలీలో ప్రతీ అంశం ఒక సంచలనమే..వీరు ఆరుపదుల వయసులో కూడా అందంగా కనిపిస్తుంటారు..దీనికి కారణం మేకప్ కూడా అని చెప్పవచ్చు..అంబానీ భార్య నీతా అంబానీ నుండి కోడలు శ్లోక్ మెహతా వరకు మేకప్ చేసే ఆర్టిస్ట్ వీరి అందానికి ప్రధాన కారణం..అసలు వీరికి మేకప్ ఆర్టిస్ట్ ఎవరూ..? ఈయన ఒక్కసారి మేకప్ వేయడానికి ఎంత తీసుకుంటారు..? ఇప్పుడు తెలుసుకుందాం..
ముకేష్ అంబానీ కుటుంబం ఎప్పుడూ మీడియా దృష్టిలో ఉంటుంది. ఈ కుటుంబం ఒక్కో సభ్యుడి స్టైల్, పర్సనాలిటీ, ఫ్యాషన్ ఎవరూ దాటలేని ప్రత్యేకతతో నిలిచింది. ముఖ్యంగా, 70 ఏళ్లు వయసులో ఉండగా కూడా నీతా అంబానీ ఇంకా అద్భుతంగా కనిపించడం అందరినీ ఆకట్టుకుంటుంది.ఈ అందానికి ప్రధాన కారణం సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్. నీతా అంబానీ మాత్రమే కాదు, ఆమె కుమార్తె ఇషా అంబానీ, కోడలు శ్లోకా మెహతా కూడా మిక్కీ దగ్గర మేకప్ చేసుకుంటారు.

ఇక మిక్కీ కాంట్రాక్టర్ గురించి చెప్పాలంటే, ఈయన చాలా మంది సెలబ్రిటీలకు మేకప్ చేస్తారు. బాలీవుడ్ ప్రముఖ తారలలో కరీనా కపూర్, దీపికా పదుకొణె, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, శిల్పా శెట్టి, సోనాలి బింద్రె లాంటి వారితో పనిచేశారు. ప్రస్తుతం మిక్కీ నీతా అంబానీ మరియు ఆమె కుటుంబంలోని ఇతర ప్రముఖులకు మేకప్ అందిస్తున్నారు.మిక్కీ ఫీజు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఆయన దగ్గర మేకప్ చేసుకోవాలంటే ముంబయిలో ఒక్కరోజు ఒక వ్యక్తికి రూ. 75,000 నుంచి 1 లక్ష వరకు చార్జ్ చేస్తారు. పెద్ద సెలబ్రిటీలు లేదా ప్రత్యేక సందర్భాల కోసం ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని సమాచారం ఉంది. ఈ ఫీజు చాలా కంపెనీల సీఈఓలకు కూడా ఎక్కువ అని చెప్పవచ్చు.

మిక్కీ కెరీర్ ప్రారంభం టోక్యో బ్యూటీ పార్లర్లో హెయిర్‌డ్రెస్సర్‌గా జరిగింది. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉండగా, నటి హెలెన్ ఆయనను సినిమాల్లో మేకప్ ఆర్టిస్ట్‌గా తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీని తర్వాత మిక్కీ అనేక సినిమాల్లో పనిచేశారు.ప్రస్తుతం మిక్కీకి 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అందుకే, ఆయన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్టుల్లో ఒకరుగా నిలిచారు.





