అసలు అంతరిక్షంలో ఏముంది..? భూమ్మీద మాత్రమే జీవం ఉందా..? ఇతర గ్రహాలపై ఎటువంటి జీవులున్నాయి..? అన్నింటికంటే ముఖ్యంగా పురాణాలలో చెప్పే విధంగా నిజంగానే భూమి అడుగు భాగంలో పాతాళలోకం ఉందా..? అంటే….ఇలాంటి ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భూమిమీద మానవ జాతి తరహా కొత్త జీవులపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నా..ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేక పోయారు..కానీ ఏలియన్స్ ఉన్నాయని కొందరు వాదిస్తే, అవి నిజంగానే ఏదో గ్రహంపై ఉండి ఉంటే మనతో ఎందుకు కాంటెక్ట్ కాలేకపోతున్నాయన్న వాదనలు కూడా లేకపోలేదు..కానీ భూ ఉపరితలంలో కచ్చితంగా ఏలియన్స్ ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు.నిజానికి ఎర్త్ సర్ఫేజ్పై పెద్ద హోల్ చేసుకుంటూ వెళ్తే ఏం వస్తుంది.? మట్టి, రాళ్లు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయి. అయితే వీటన్నింటిని దాటుకుంటూ వెళ్లినప్పుడు ఏకంగా ఓ ప్రపంచమే కనిపిస్తే..! ఏంటి.. భూమి లోపల మరో ప్రపంచమా..? అని షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. ఇంతకీ భూమిలోపల ఏముంది? భూమిలోపల పాతాల లోకంఉందా? అందులో ఎవరున్నారు..తెలుసుకుందాం..
ఎర్త్ సర్ఫేజ్పై పెద్ద హోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మనకు మించిన నాగరికత ఉందా? అక్కడ ఏకంగా ఓ అద్భుతమైన ప్రపంచమే ఉందా? భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళ్లితే ఓ నాగరికత, లేదా విచిత్ర మనుషుల ఉందా? అంటే అవును..ఇదంతా నిజమేనట…దీన్ని ఏషియన్స్, గ్రీక్, రోమన్స్ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్ముతున్నారు…

మరి భూమిలో ఉండే జీవం ఎలా ఉంటుంది? మనలాగే నాగరికత ఉందా? అంటే..అక్కడ జీవులు మనకన్నా వందరేట్లు అప్డేట్ వర్షన్లో ఉండవచ్చట..మనం ఏవిధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటాయని అనుకుంటున్నామో.. అదే విధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని తెలుస్తోంది. కొన్ని సార్లు ఆకాశంలో కనిపించే ఫ్లైయింగ్ సాసర్లు, విచిత్ర ఆకారంలో ఉండే వస్తువులు కనిపించడం మనం చాలానే చూశాం. అయితే వాటన్నింటిని ఏలియన్సే పంపించి, మనల్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు.
మన పురాణాల ప్రకారం…భూమి లోపల భాగల్లో అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు ఉంటాయని చెప్తారు..అయితే, మిగతా లోకాల గురించి పక్కనబెడితే భూ కేంద్రకం స్థానంలో మాత్రం పాతాళ లోకం ఆనవాళ్లు లభించినట్టు తాజాగా పరిశోధకులు చెబుతున్నారు. కథలుగా, పుక్కిటి పురాణాలుగా మారిన ఆ మిస్టరీ ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు శాస్త్రవేతలు..
భూ ఉపరితలం నుంచి దాదాపు 6,400 కిలోమీటర్ల క్రింద గోళాకారంలో ఓ కోర్ ఉంటుందని,అది ఐరన్ ఓర్‌తో నిండిన కఠిన ఘన స్థితిని కలిగి ఉన్నదని ఇప్పటివరకూ పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే గత 50 ఏండ్లుగా పరిశోధకులు కూడా ఇదే విషయం పై పరిశోదనలు ముమ్మరం చేశారు.. అయితే, కోర్ ప్రాంతం ఘన స్థితిలో కాకుండా మెత్తగా ఉన్నదని, అందులో బోలుగా కొన్ని ఖాళీ ప్రదేశాలు కూడా ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు 2021 లో ఒక అంచనాకు వచ్చారు..
భూ పొరలను…క్రస్ట్, మాంటల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్గా విభజిస్తారు. లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు, పీడనంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సుమారు 1300 కిలోమీటర్ల వ్యాసార్ధంతో ఉండే భూ కేంద్రకం కఠినమైన ఘన స్థితిలో ఉంటుందని ఇప్పటివరకూ అందరూ భావించారు. కానీ మెత్తటి పదార్థంతో కేంద్రకం నిండి ఉందని, ఔటర్ కోర్ చుట్టూ ద్రవ పదార్థం ఉందని భూకంప శాస్త్రవేతలు కనుగొన్నారు. కోర్ మధ్య ప్రాంతంలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు వారు అంచనా వేశారు. అయితే ఆయా ప్రదేశాల్లో బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలు, పీడనం ఉంటుందని తెలిపారు. ఆ ఖాళీ ప్రాంతాలే ‘పాతాళలోకం’ అయి ఉండచ్చేమో అనే అభిప్రాయానికి వచ్చారు శాస్త్రవేతలు..అందుకే శాస్త్రవేత్తలు భూమి లోపల ప్రాంతంలో ‘మిస్టరీ వరల్డ్’ ఉందనే వాదనను అంత ఈజీగా కొట్టిపడేయలేకపోతున్నారు…

కోర్ ఉన్న ప్రాంతానికి శాస్త్రవేత్తలు కొన్ని శక్తివంతమైన కాంతి తరంగాలను పంపించారు. కఠినమైన ఘన పదార్థం ఉన్న కోర్ ప్రాంతానికి వెళ్లిన తరంగాలు ఊహించని రీతిలో తిరిగి వెనక్కి వచ్చాయి. అయితే, కోర్‌లోని మరికొన్ని ప్రాంతాల గుండా ప్రసరించిన తరంగాలు తిరిగి వెనక్కి రాకపోవటంతో శాస్త్రవేతలకు ముచ్చెమటలు పోశాయి. ఎందుకంటే అక్కడ పంపిన తరంగాలు ఎందుకు తిరిగి రాలేదు అనేది పెద్ద మిస్టరీనే కాబట్టి…ప్రయోగ విధానంలో ఏమైనా తప్పులు దొర్లాయేమోనని ఒకటికి రెండు సార్లు ప్రయోగాలను మళ్లీ, మళ్లీ చేశారు వారు. అయినప్పటికీ, ఆ ఫలితాల్లో మార్పు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాలు మెత్తగా, ఖాళీగా ఉన్నాయన్న అభిప్రాయానికి పరిశోధకులు వచ్చారు. పైగా అదే మిస్టరీ లోకం అయి ఉండచ్చనే అభిప్రాయం కూడా వారు వ్యక్తపరిచారు..
జూల్స్ వెర్నో అనే ఫ్రెంచ్ నవలా రచయిత 1864లో ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ అనే నవలను రాశారు. అందులో భూ కేంద్రకంలో మరో ప్రపంచం ఉన్నదని, భారీ జీవులు అక్కడ సంచరిస్తున్నట్టు ఆ నవలలో వర్ణించారు. ఈ నవల రాసేంతవరకు అసలు భూకేంద్రకం ఎలా ఉంటుందన్న దానిపై కూడా శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే, నవలలో పేర్కొన్నట్టు భూమిలోపల పాతాళలోకం ఉండొచ్చన్న వాదనకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయి.
సాధారంగా మన భూమి యొక్క వ్యాసార్థం.. 6వేల 371కిలో మీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6వేల 371 కిలోమీటర్లు అన్న మాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా..? అని తెలుసుకునేందుకు.. మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగిన అత్యంత లోతు కేవలం 12 కిలో మీటర్లు మాత్రమే.. అంటే ఇంకా తవ్వాల్సిన దూరం 6వేల 359కిలో మీటర్లు. ఇది అసలు ఎప్పటికి సాధ్యపడుతుందో తెలియదు కానీ.. ఒకేవేళ మానవుడు ఈ ఫీట్‌ను సాధించగలితే మాత్రం కచ్చితంగా, మరో ప్రపంచాన్ని చూడగలమని చెబుతున్నారు కొందరు సైంటిస్టులు..





