గత నాలుగు-ఐదు రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ లో తలెత్తిన సంక్షోభం దేశం మొత్తాన్ని షేక్ చేసింది. DGCA, సెంట్రల్ గవర్నమెంట్ మరియు సుప్రీం కోర్ట్ కూడా ఈ విషయంలో కలుగజేసుకున్నారు. వందలాది, వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో (ఎయిర్‌పోర్ట్‌లో) ఎక్కడికి పోవాలో తెలియక నరక యాతన అనుభవించారు. పెళ్లిళ్లు, మెడికల్ ఎమర్జెన్సీలు, ఫారిన్ ఎడ్యుకేషన్ ట్రిప్పులు మరియు బిజినెస్ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఈ మొత్తం ఇండిగో క్రైసిస్‌లో, రెండు విషయాలు మనల్ని నిజంగా కలవరపెడుతున్నాయి.
1. ఉద్యోగుల పైన నింద (Employees Facing The Blame)సంక్షోభానికి ముఖ్య కారణం ఇండిగో యాజమాన్యం చేసిన తప్పు, వారి నిర్లక్ష్యం మరియు ముందుచూపు లేని ప్రవర్తన.యాజమాన్యం (Management) ఎక్కడో కూర్చుని కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఇక్కడ వచ్చిన ప్రయాణికులను నేరుగా ఫేస్ చేస్తున్నది ఉద్యోగులే (employees).నిజానికి ప్రయాణికులు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఇండిగో ఉద్యోగుల దగ్గర కూడా ఎలాంటి ఆన్సరూ లేదు.అయినా సరే, ఇండిగో సంస్థలో పని చేస్తున్న పాపానికి, ఈ నింద మొత్తం ఉద్యోగులే తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల వారిని బూతులు తిడుతున్నారు, కొడుతున్నారు.ఎలాంటి సెక్యూరిటీ లేకపోయినా కౌంటర్లో కూర్చుని, ప్రయాణికులను సముదాయించి, సద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగులను నిజంగా మెచ్చుకోవాలి.
2. ఇతర ఎయిర్‌లైన్స్ వ్యాపారం (Profiteering by Other Airlines) ఒకరి బాధను మరొకరు వ్యాపారం చేసుకోవడం ఈ సంక్షోభంలో చాలా దారుణమైన విషయం.వేలాది మంది ప్రయాణికులు నరక యాతన పడుతుంటే, మిగిలిన ఎయిర్‌లైన్స్ వాళ్ళ బాధను ‘క్యాష్’ చేసుకుంటున్నాయి.మామూలు రోజుల్లో ₹5,000 నుండి ₹8,000 లోపల ఉండే టికెట్ ధరను, ఇప్పుడు ₹60,000, ₹70,000, ₹80,000, మరియు కొన్ని చోట్ల ₹1 లక్ష వరకు అమ్ముతున్నారు.ఇలాంటి మానవత్వం లేని (inhuman) పరిస్థితులలో, అంత అమానవీయంగా, వ్యాపారం చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్న తలెత్తుతోంది.





