అతను ప్రజలను రక్షించాల్సిన రక్షకబటుడు..తప్పు చేసేవారికి దండించే అర్హత కల్గిన నాలుగో సింహం..కానీ అతని బాధ్యత ఖాకీ చొక్కాకే పరిమితం..బాధ్యతలు మరిచిన ఖాకీ కాస్త కామా తురాణం న భయం న లజ్జ అంటూ కామ క్రీడలలో మునిగిపోయాడు…పోలీస్ వాహనం నడిపే బాధ్యత కలిగిన కానిస్టేబుల్… చిన్నారుల ముందే అసభ్యకర నృత్యాలు చేస్తూ కామకేళి ప్రదర్శించాడు..ఓ మహిళతో కలిసి ఇతగాడు చేసిన అశ్లీల నృత్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
కంకిపాడు రూరల్ సీఐ జీప్ డ్రైవర్ గా పనిచేస్తున్న అజయ్‌కుమార్ సిగ్గు వదిలి..చిన్నపిల్లలు చూస్తూ ఉండగానే అశ్లీల నృత్యం చేశాడు..ఇతగాడి వేషాలన్నీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవటంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అజయ్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను అవమానపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు..
ఈ సంఘటనపైవెంటనే విచారణను ఆదేశించి,కింది స్థాయి ఉద్యోగులకు సమగ్ర నివేదిక ఇవ్వమని ఆదేశాలిచారు..నివేదిక అనంతరం అవసరమైతే మరింత కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించినట్లు సమాచారం..వీడియో చూశాక నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు..చిన్నారుల ఎదుటే ఇలాంటి చేష్టలా?..పోలీసు యూనిఫామ్‌కు ఇలా మచ్చ తెచ్చేవారికి ఎందుకు క్షమించాలని..ఆగ్రహావేశంతో కామెంట్ల వర్షం కురుస్తోంది..సస్పెన్షన్ మాత్రమే కాదు… ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు..





