అది దక్షిణ అమెరికాలో దేశాలలోఅతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్. బ్రెజిల్ లో బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం రియో డి జనీరో. ఈ నగరానికి ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి పరశించిపోయే అందమైన మనోహరమైన ‘నోయివాడో కార్డెరో’ (Noiva Do Cordero) చిన్న టౌన్.ఎంతో అందమైన ఈ గ్రామంలో అంతకంటే అందమైన అప్సరసల్లాంటి అమ్మాయిలు చాలా చాలా ప్రత్యేకమైనవారు. అందాలకు నిలయంగా ఉండే నోయివాడోలో అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఇక్కడుండే చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవటమే ఆ ప్రత్యేకత..! ఇక్కడి అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవటం గురించి చాలా పెద్ద కథే ఉంది.అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయ్యాల్సిందే..

బెండకాయ ముదిరిన, బ్రహ్మచారి ముదిరిన పనికిరావని అంటుంటారు పెద్దలు. దేశంలో ప్రస్తుత మగవాళ్ల పరిస్థితి అలానే ఉంది. ప్రస్తుతం పెళ్లి కానీ ప్రసాదులు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలకు కాబోయే వరుడి గురించి ఓవర్ ఎక్స్ప్టెషన్స్ ఉండటంతో.. రైతులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అబ్బాయిలకు అసలు పెళ్లి కూతుర్లు దొరకడం లేదు. దీంతో 40 ఏళ్లు వచ్చినా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు అబ్బాయిలు. కుర్రాడు కత్తిలా ఉండకపోయినా పర్లేదు.. సాఫ్ట్ వేర్ లేదా, పెద్ద బిజినెస్, అది కాకుంటే ప్రభుత్వ ఉద్యోగం.. ఇలాంటి మగవాళ్లకే తమ అమ్మాయిల్ని ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడంతో ఈ సమస్య తలెత్తింది. తాము ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని పోరు పెడుతున్నా.. బాగా చూసుకుంటామని చెబుతున్నా.. మీ పెత్తనం అప్పజెబుతామన్న ససేమీరా అంటున్నారు.మన దేశంలో ఈ పరిస్థితి నెలకొంటే.. మరో ఊరిలో అమ్మాయిలకు బ్రహ్మచారిణీలుగా మిగిలిపోతున్నారు. పోనీ అందగత్తెలు కాదంటే.. కల్లు చెదిరే సౌందర్యం వారిది. కానీ చాలా మంది ఆడవాళ్లకు పెళ్లిళ్లు కావడం లేదట. ఇంతకు ఆ ఊరు ఎక్కడ ఉందంటే.. బ్రెజిల్ దేశంలోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బెలోవాలో మున్సిపాలిటీ పరిధిలో ఉంది నోయివా డో కోర్డెరో ఊరు.

ఈ ఊరికి సంబంధించిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మా గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావలెను. మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెండ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు.. ఇరుపక్షాలు ఒప్పుకొంటేనే వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు..మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు.. కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేఛ్చను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు. ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు.. బారెడు పొద్దెక్కేవరకు నిద్రపోయి.. బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కూయక ముందే నిద్ర లేచి పనులు చేస్తారు.అవసరం అయితే పలుగు, పార పట్టుకుని పొలం పనులకు సైతం వెళ్తారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం కూడా అస్సలు వద్దు ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడీ ఎక్కడా అని వెతుకుతున్నారు. ఇకపోతే, ఇలాంటి అమ్మాయలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా మూడు షరత్తులున్నాయి. అవి ఏంటంటే..
ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా మళ్లీ ఇంటిబాట పట్టాల్సిందే. ఇంతకీ ఆ కండిషన్లు ఏమిటంటే? ఒకటి.. వంట. రెండు.. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం. మూడు.. టాయిలెట్ కడగడం. ‘ఓసోస్! అదెంత పని. అవన్నీ మాకు వచ్చు కదా’ అంటారేమో.. ఆ మూడింటినీ మీ ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పనిచేసినా ఆలూమగలు కలిసే చేయాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే, అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే.

మరి ఆ ఊరి స్పెషాలిటీ ఏమిటంటే.. బ్రెజిల్‌కు చెందిన మారియా సెన్హోరిన్హా 1891లో ఓ వ్యక్తిని ప్రేమించింది. తాను ప్రేమించిన వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. దీంతో మరియా బంధువులు, గ్రామస్థులు ఆమెను బహిష్కరించారు. దీంతో అప్పుడు మరియా డొ కోర్డెరో గ్రామానికి వచ్చింది. అక్కడే స్థిరపడింది. అనంతరం పురుషాధిక్యత లేని సమాజాన్ని ఏర్పాటు చేసి.. సక్సెస్ అందుకుంది. ఈ గ్రామంలోని మహిళలు. తమకంటూ కొన్ని ఆచారాలు, పద్ధతులు, నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని అతిక్రమించడానికి వీలు లేదు. మరి ఇవన్నీ ఒకే అయితే బ్రెజిల్‌లోని నోయివా డో కోర్డెరో గ్రామానికి వెళ్లి అబ్బాయిలు అక్కడి అమ్మాయిల మనసును గెలిచి మనువాడొచ్చు.





