స్వదేశీ క్లౌడ్ ప్లాట్‌ఫాం జోహో పరిచయం చేసిన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ కేవలం మూడు రోజుల్లోనే భారీ డౌన్లోడ్ లను నమోదు చేసింది. జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించినట్లుగా, రోజువారీ సైన్అప్స్ 3 వేల నుంచి 3.5 లక్షలకు చేరాయని చెప్పారు. దీంతో నెటిజన్లు దీనిని ‘వాట్సప్ కిల్లర్’గా అభిప్రాయపడుతున్నారు.

అరట్టై యాప్ ఫీచర్లు:
అరట్టై అంటే తమిళంలో ‘మాట్లాడటం’ అని అర్థం. 2021లో లాంచ్ అయిన ఈ యాప్ వన్-టు-వన్ చాట్స్, గ్రూప్ చాట్స్, వాయిస్ నోట్స్, ఫోటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్కాస్ట్ ఛానల్స్ వంటి మల్టీపుల్ ఫీచర్లను అందిస్తోంది.
మల్టిపుల్ డివైస్ సపోర్ట్ & ప్రైవసీ:
టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్, ఆడియో/వీడియో కాల్స్ (ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్)తో పాటు, డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, TV ఇంటిగ్రేషన్‌తో మల్టీ-డివైజ్ సపోర్ట్ కూడా ఇది ఉపయోగ పడుతుంది. జోహో వ్యక్తిగత డేటాను మోనిటైజ్ చేయవద్దని స్పష్టంగా వెల్లడించింది, ప్రైవసీని ప్రధానాంశంగా తీసుకొంది.

అంచనాకు మించిన డౌన్లోడ్లు:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ యాప్‌ను ప్రోత్సహించడంతో, అరట్టై ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్లలో నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది. “మూడు రోజుల్లో 100 రెట్లు వృద్ధి, రోజూ 3 వేల నుంచి 3.5 లక్షల సైన్అప్స్,” అని శ్రీధర్ వెంబు తెలిపారు.యూజర్ల సంఖ్య పెరగడం కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఓటీపీ ఆలస్యం, కాంటాక్ట్ సింక్ సమస్యలు, కాల్ ఫెయిల్యూర్లు వస్తున్నాయి. జోహో టీస్టీమ్ వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటించింది.
వాట్సప్‌కి సవాలు విసురుతున్న అరట్టై:
భారతదేశంలో 50 కోట్లకుపైగా వాట్సప్ యూజర్లు ఉన్న నేపథ్యంలో, అరట్టైకు ఇది పెద్ద సవాలు. ప్రస్తుతానికి, కాల్స్ ఎన్క్రిప్టెడ్ అయినప్పటికీ, చాట్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కాని విధంగా ఉన్నాయి. అయితే జోహో తన ప్రైవసీ వాగ్దానాన్ని అమలు చేస్తే, ఇది వాట్సప్‌కు గట్టి పోటీగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





