ఒక స్టార్ జీవితం ఒక్క క్షణంలో మారిపోతే ఎలా ఉంటుంది..?దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అదే జరిగింది..మూవీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇది. లోకల్ కదూ..ఇది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్న వార్త..అందాల రాశి, కోట్లాది మంది అభిమానుల మనసుల మహారాణి సమంత… అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఈమె పెళ్లి, లవ్ కు సంబందించి చాలా సార్లు గాసిప్స్ వచ్చాయి..అవన్నీ నిజమో అపద్దమో పక్కన పెడితే..ప్రస్తుతం సమంతా అటు మూవీ ఇండస్ట్రీ కి ఇటు అభిమానులకు షాక్ ఇచ్చింది..
డైరెక్టర్, వెబ్ సిరీస్ మేకర్ రాజ్ నిడిమోరుతో సమంతా పెళ్లి చేసుకుంది..ఇదే సమంత అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి..రివీల్ కానీ ప్రేమ కథలు ఎప్పుడూ ఆసక్తికరమే..కానీ సమంత – రాజ్ కథ మాత్రం సైలెంట్‌గా మొదలై… టైఫూన్లా ట్విస్టులతో పీక్‌కి చేరింది..సినిమాల ద్వారా పరిచయం..ఆ పరిచయం స్నేహంగా మారింది..స్నేహం ప్రేమగా మొగ్గ తొడిగింది.. ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేసింది..ఇన్ని రోజులు గాసిప్‌గా వినిపించిన పేరు…ఇప్పుడు పెళ్లి బంధం ద్వారా నిజమైంది..అయితే…ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..నాన్-స్టాప్ షూటింగ్స్, కెరీర్ పీక్, అభిమానుల హడావిడి మధ్య…ఎవరూ ఊహించని విధంగా…కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని ధ్యానలింగ ఆలయంలో వీరిద్దరూ పవిత్రంగా పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు.గ్లామర్‌కి, లైమ్‌లైట్‌కి దూరంగా… ఆధ్యాత్మిక స్థలం సాక్షిగా…ఇది కేవలం పెళ్లి కాదు, ఇది ఒక ఆత్మల కలయిక అంటూ అభిమానులు కామెంట్స్‌తో ఆదరగోడుతున్న వేళ సమంతా పెళ్లి ఫొటోలని సైతం share చేసింది..
“ఇది మా సమంత స్టైల్”…“పక్కా సినిమా ట్విస్ట్‌లా ఉంది”…“వావ్.. Divine Wedding” అంటూ…ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్బుక్… ఎక్కడ చూసినా #SamanthaRajWedding హ్యాష్‌ట్యాగ్ మోతే మోగిపోతోంది..అఫీషియల్ ఫోటోలు చూశాక ఈ ఊహాగాననికి కాస్త ఊతం ఏర్పడి ఈ వార్త ఒక ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది..సినిమాలోనే కాదు… నిజ జీవితంలోనూ సమంత తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సెన్సేషన్..ఎందుకంటే..ఆధ్యాత్మికత- ప్రేమ-సీక్రెట్ వెడ్డింగ్… ఈ కాంబో ఇండియన్ మీడియాకే కొత్త కథనం..ఇండస్ట్రీలో భారీ ఊహాగానాలు కొనసాగుతున్న వేళ…సమంత చెప్పని మాటలకన్నా… ఆమె జీవితం రాస్తున్న స్టోరీనే పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది..సో ఎన్టీ18 న్యూస్ తరఫున కూడ సమంతా రాజ్ లకు హ్యాపీ మ్యారేడ్ లైఫ్..





