మన దేశంలో ఆదాయపన్ను, జీఎస్టీ, సెస్ వంటివి తప్పనిసరిగా చెల్లిస్తూనే ఉంటాం. కానీ కొన్ని దేశాల్లో మనకే వింతగా అనిపించే పన్నులు వసూలవుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో పౌరులు చాలా రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

🐶 కుక్కల పన్ను
జర్మనీలో కుక్కలను పెంచుకునే వారు తప్పనిసరిగా ‘Hundesteuer’ అనే పన్ను చెల్లించాలి. రాష్ట్రం, నగరం వారీగా ఈ పన్ను వేరువేరుగా ఉంటుంది. కుక్కల సంఖ్యను నియంత్రించటమే లక్ష్యంగా ఈ పన్ను వసూలు చేస్తున్నారు. మన దేశంలో అయితే ఇలాంటి పన్ను ఎక్కడా లేదు.
📺 టీవీ పన్ను
ర్మనీలో ఇంట్లో టీవీ లేదా రేడియో ఉంటే ‘Rundfunkbeitrag’ అనే పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. ఈ పన్నుతో దేశంలోని పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ ఛానెల్లను నిర్వహిస్తారు. మన దేశంలో డీడీ ఫ్రీడిష్ మాత్రమే ఉండగా, అక్కడ మాత్రం ఇది తప్పనిసరి పన్ను.

🍺 బీర్ పన్ను
జర్మనీలో బీర్పైనా ప్రత్యేక పన్ను ఉంటుంది. అందుకే అక్కడ బీర్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి.ఇలా మనకు వింతగా అనిపించే పన్నులు కొన్ని దేశాల్లో సాధారణమే. పన్నులు మాత్రమే కాదు, ఆ దేశాల చట్టాలు కూడా జీవన విధానాన్ని క్రమబద్ధం చేయడమే లక్ష్యంగా ఉంటాయి.





