ఇప్పడు మీకు చెప్పబోయే బావి గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు..రోజుకు దాదాపు 5 లక్షలకు పైగా నీటిని ఈ బావిలో నుండి తీసినా కూడా ఇది ఎప్పటికీ ఎండిపోదు..అంతే కాదు ఈ బావిలో ఉన్న నీటి గురించి పరిశోదనలు చేసిన శాస్త్రవేతలు సైతం బిత్తరపొయ్యారు..అంతకీ ఆ బావి ఎక్కడ ఉంది…శాస్త్రవేతలు షాక్ అయ్యేంతగా ఆ బావిలో ఏముంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జమ్..జమ్..ఇది సౌదీ అరేబియాలో ఉన్న ఎడారి ప్రాంతంలో ఉన్న మిస్టేరియస్ బావి..ప్రతీ నీటిబొట్టుకు ఇబ్బంది పడే ఎడారి ప్రాంతంలో ఎటువంటి బావి అయినా ఒకనాటికి ఎండిపోవాల్సిందే..కానీ దాదాపు 4000 సంవత్సరాలనుండి ఈ బావిలో నీరు ఎప్పుడు తరగలేదు..రోజుకు లక్షలాది లీటర్లు ఈ బావి నుండి తీసినా కూడా ఇది ఎప్పటికీ నిండుగానే ఉంటుంది…ఇది సౌదీ అరేబియాలో ఇస్లాంలో పవిత్రమైన ప్రదేశం మక్కాకు తూర్పు దిక్కున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది..మక్కాకు హజ్ యాత్ర నిమిత్తం వెళ్లిన వేలాదిమంది హజ్ యాత్రికులు సైతం వీటిని పవిత్ర జలంగా తాగుతారు..ఇంకా ఈ జం జం నీటి గురించి విషయాలు తెలిస్తే మీరు కూడా కచ్చితంగా మరింత షాక్ అవుతారు…అదేంటంటే శాస్త్రవేత్తలు కూడా ఈ నీటి గురించి చాలా పరిశోదనలు చేసి అలిసిపోయారు..ఎందుకంటే వాళ్లకు సైతం ఈ వాటర్ మిస్టరీ అర్తం కాలేదు కాబట్టి..ఇంతకీ అంతగా ఈ నీటిలో ఏముంది..? ఇవి ఎక్కడినుండి వస్తున్నాయి..? ఈ నీరు TFM ఎంత? ఈ నీరు తాగితే ఎటువంటి జబ్బులు నయమవుతాయి..? ఈ నీటిపై చివరకు శాస్త్రవేతలు తేల్చిందేమిటి..? ఇటువంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చెప్పబోతున్నాం..
ఇస్లాం మతస్తులకు ఈ నీరు అమృతంతో సమానం..ప్రపంచంలో అతిపెద్ద మతాల్లో ఇస్లాం మతం 2వ స్థానంలో ఉంది..ఇందులో ఎన్నో కథలు మీరు వినే ఉంటారు..అందులో జం జం నీరు గురించిన ఒక అద్భుతమైన సంఘటన..జంజమ్ అనేది చరిత్రలో ముఖ్యంగా హజ్ తీర్థయాత్ర సమయంలో అటు యత్రికులకు ఇటు బిలియన్ల మంది స్థానికులకు నీటిని అందించే బావి పేరు..ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో ముడిపడి ఉంది..వారే ప్రవక్తలు ఇబ్రహీం, ఇస్మాయిల్ మరియు పైగంబర్ ముహమ్మద్ గారు అలాగే ఇస్మాయిల్ తల్లి హాజ్రా.
హజ్ యాత్రకు ఈ బావి నీరు ప్రధానమైనవి..కాబాకు తూర్పున కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఈ బావి 35 మీటర్ల లోతులో ఉంది..దీని పైభాగంలో సొగసైన ఒక సొగసైన గోపురం కూడా ఉంది.ప్రవక్త ఇబ్రహీం భార్య హాజ్రా గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త దేవుడి ఆజ్ఞ అని చెప్పి..ఆమెను చుక్క నీరు లేని ఎడారిలో వదిలేస్తారు..భర్త ఆజ్ఞ ప్రకారం శిరసావహించిన ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది అతనే ఇస్మాయిల్..డెలివరీ అనంతరం వేడి ఇసుక ఉన్న ఎడారిలో తను స్నానం చేసి..తన బిడ్డకు స్నానం చేపించి..దాహర్తిని తీర్చుకోటం కోసం నీరు ఎక్కడన్నా దొర్కుతుందా అని బిడ్డ కోసం తల్లి బాధపడుతూ తిరుగుతూ ఉంటుంది.ఇంతలో ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది..అప్పుడే పుట్టిన బిడ్డ తన కాళ్ళను భూమికేసి కొడుతూ ఏడవసాగటం..ఆ పాదాల్లో నుండి నీరు ఉబికి రావటం ఒకేసారి జరగాయి..దీంతో ఆశ్చర్య పోయిన తల్లి హాజ్రా..అది దేవుడి సృష్టిగా భావించి ఆ నీటి ద్వారా తన అవసరాలు తీర్చుకుని..ఎక్కువ వేగంగా చీమ్ముతున్న నీటిని చూస్తూ జమ్ జమ్ అంటుంది..
అరబిక్ ప్రకారం జమ్ జమ్ అంటే శాంతించమని అర్తం…అప్పుడు ఆ నీరు ఫ్లో తగ్గిందట..ఆ ప్లేస్ లో భావిని నిర్మించారు..అప్పటి నుండి ఆ నీరు వచ్చిన భావిని జమ్ జమ్ బావి అంటారు..ప్రవక్త ఇస్మాయిల్ కోసం దేవుడు సృష్టించిన నీరు మరియు అయన పాదాల నుండి పుట్టిన నీరు కాబట్టి ఆ నీటిని ఇస్లాంలో చాలా పవిత్రంగా భావిస్తారు..వారి కష్టాలు కూడా తీరుస్తాయి అని వారు నమ్ముతారు..
అసలు ఎడారి మధ్యలో ఈ నీరు ఎలా వస్తున్నాయని మీ మనసులో కలిగే సందేహం కదా..? దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోదనలు కూడా చేశారు..చివరికి వారు నిర్దారించింది ఏంటంటే..? మక్కాకు ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలోని జలపాతాల నుండి ఈ నీరు వస్తున్నాయని..కానీ దీన్ని కూడా ఆఫీసియల్గా ధ్రువీకరించలేదు..ఈ నీటిని చూసి ఇప్పటి శాస్త్రవేతలు సైతం ఆశ్చర్యపోతారు..ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ముస్లీంలు ఈ నీటిని ప్రపంచంలో ఉన్న నీటి కంటే ఎందుకు పవిత్రంగా భావిస్తారు..? ఈ నీటికి అంత శక్తి ఎలా వచ్చింది..? అనే విషయాన్ని కనుగొనెందుకు చాలా మంది శాస్త్రవేతలు పరిశోదనలు చేశారు..కానీ జపాన్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మసారో ఎమటో ఈ నీటిపై చాలా కాలం పాటు పరిశోదనలు చేశాడు..మసారో ఎమాటో ప్రపంచంలో రకరకాల ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రాంతాలపై పరిశోదనలు చేసేవాడు..అందులో భాగంగా జమ్ జమ్ నీటిపై ఇతను పరిశోదనలు చేసి తన జీవితంలో ఇటువంటి నీటిని ఎప్పుడు చూడలేదట..
ఈయన చెప్పేదేమిటంటే జమ్ జమ్ నీటి కణాలను మైక్రోస్కోప్‌లో చూడటం కూడా కుదరదు..ఈ నీరు ఎంత శక్తివంతమైనవంటే ఈ నీటి కణాలను చూడటానికి..దీన్ని క్రిస్టల్స్ చేయటానికి ఒక చుక్క జమ్ జమ్ నీటికి 1000 చుక్కల సాధారణ నీటిని కలపాలి..అప్పటికి గాని మైక్రోస్కోప్ లో ఈ నీటి కణాలను చూడలేము..మసారో ఎమాటో చెప్పిన ఇంకో విషయం ఏంటంటే 1000 లీటర్ల సాధారణ నీటిలో 1లీటర్ జమ్ జమ్ నీటిని కలిపితే 1000 లీటర్లు సాధారణ నీరు జమ్ జమ్ గా మారిపోతాయి..ఆశ్చర్యంగా ఉంది కదా..? జపాన్ శాస్త్రవేత్త చెప్పిన దానిబట్టి ఈ నీటితో చేసిన క్రిస్టల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి..సాధారణ నీటితో చేసిన క్రిస్టల్స్ తో పోలిస్తే ఈ క్రిష్టల్స్ అందంగా కూడా ఉంటాయి..ఇలాంటి నీటిని పరీక్షించటం సైన్స్ కు సైతం సవాలుగా మిగిలిందని అయన అంటున్నారు..ముస్లీంలు ఈ నీటిని చాలా పవిత్రమైనవిగా భావిస్తారు..కానీ కొందరు ఈ నీటిని కనీసం తాగే నీటిగా కూడా భావించటంలేదు..
1866లో ఇస్తాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు నుండి కలరా మహమ్మారిలో భాగంగా హజ్ యాత్ర చర్చనీయాంశంగా మారింది . అయితే కలరా ప్రపంచీకరణకు భారతీయ ముస్లింలను హజ్‌కు రవాణా చేస్తున్న బ్రిటీష్ ఆవిరి-నౌకలు ప్రధానంగా కారణమని ఆ సమావేశం గుర్తించింది . ఒట్టోమన్ రాష్ట్రం తత్ఫలితంగా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎర్ర సముద్రాన్ని ఉపయోగించి నిర్బంధ వ్యవస్థను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ప్రజల ఎదురుదెబ్బలు మరియు స్వేచ్ఛా వాణిజ్యంలో నిమగ్నమయ్యే దాని సామర్థ్యంపై ఆంక్షలు వస్తాయని భయపడి రాబోయే దశాబ్దాలలో బ్రిటన్ ఈ వ్యవస్థను బలహీనపరిచేందుకు ప్రయత్నించింది .
జమ్జమ్ బావి నుండి నీటి భద్రతకు సంబంధించిన మొదటి వివాదం 1883లో ప్రారంభమైంది. 1881లో, జెడ్డాలోని బ్రిటిష్ కాన్సుల్ జేమ్స్ జోహ్రాబ్, 1883లో తన పరిశోధనలను ప్రచురించిన ఎడ్వర్డ్ ఫ్రాంక్ల్యాండ్కు నీటి నమూనాలను పంపాడు. దానిని జామ్జమ్ నీరుగా పేర్కొన్నాడు . ఫ్రాంక్లాండ్ బావి నుండి వచ్చే నీరు లండన్‌లోని మురుగునీటి కంటే జంతువుల వ్యర్థాల ద్వారా ఆరు రెట్లు ఎక్కువ కలుషితమైందని పేర్కొంది. మక్కాలో మానవ వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడం వల్ల భూగర్భజలాలు చాలా కలుషితమై కలరాకు మూలంగా మారాయని వారు వాదించారు. మక్కా యాత్రకు వచ్చిన సందర్శకులు కలరా వ్యాధిని అంతటా ప్రభావవంతంగా వ్యాప్తి చెందడానికి చూస్తున్నారని వారు అన్నారు..అతను చివరికి ఆసియా మరియు ఐరోపా ప్రజలను రక్షించడానికి ప్రజారోగ్య చర్యగా జంజమ్ను మూసివేయాలని పిలుపునిచ్చారు.దీన్ని ముస్లిం ప్రపంచం నలుమూలల నుండి వ్యతిరేకంచారు..
ఒట్టోమన్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు డచ్ దూత ద్వారా సమర్పించబడిన ఒక గ్రంథానికి ఫ్రాంక్‌ల్యాండ్ నివేదిక ఆధారమైంది. ఈ ఒప్పందం చాలా ప్రతికూలంగా స్వీకరించబడటం తో పాటు ఇస్లామిక్ వ్యతిరేక ప్రచారంగా ఇది వ్యాఖ్యానించబడింది.
తర్వాత…
1971లో, ఒక ఈజిప్టు వైద్యుడు యూరోపియన్ ప్రెస్‌కి ఒక లేఖ రాశాడు.ఇందులో జమ్జమ్ నీరు త్రాగడానికి పనికిరాదని చెప్పాడు.
కాబా నిస్సారమైన ప్రదేశం.ఇది సముద్ర మట్టం దిగువన ఉంది..ఈ బావి మక్కా నగరం మధ్యలో ఉన్నందున, నగరంలోని కాలువల ద్వారా వెళ్తున్న మురికి నీరు ఈ బావిలో కలుస్తున్నాయని అందుకే ఈ నీరు తాగేందుకు పనికిరాదని ఈ లేక సారాంశం..
ఈ అంశం పై అప్పటి సౌదీ రాజు ఫైజల్ తీవ్ర ఆగ్రహంతో సీరియస్ గా తీసుకున్నాడు..ఇది ఇస్లాం ఆచారాలను నమ్మకాలను తొక్కి పెట్టె క్రమంలో ఇలా చేస్తున్నారని గ్రహించి..వ్యవసాయం మరియు జలవనరుల మంత్రిత్వ శాఖను ఈ నీటిని పరిశోధించి, జమ్జమ్ నీటి నమూనాలను యూరోపియన్ ప్రయోగశాలలకు పంపించి ఈ నీటిని తమ సమక్షంలో పరీక్షించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించాడు.సో..వెంటనే సౌదీ మంత్రిత్వ శాఖ ఈ పనిని చేపట్టాలని జెడ్డా పవర్ మరియు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఆదేశించింది. ఇక్కడే ప్రముఖ రచయిత mr.అహ్మద్ డీసాల్టింగ్ ఇంజనీర్‌గా నియమించబడ్డారు..ఈ బాధ్యతను నిర్వర్తించడానికి అయన ఎంపిక చేయబడ్డారు.
హజ్ యాత్రికులకు ప్రతి సంవత్సరం మిలియన్ల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే ఈ బావి, దాదాపు 18 x 14 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది..ఇది ఒక చిన్న చెరువు లాంటి నీటి బావి అని నమ్మడం చాలా కష్టంగా ఉందని Mr. అహ్మద్ రాశారు. ఇది అనేక శతాబ్దాల క్రితం ప్రవక్త ఇబ్రహీం కాలంలో నుండి ఉన్నందున అప్పట్లో దీన్ని పెద్దగా నిర్మించారు..
ఇక దీనిపై విచారణ ప్రారంభమయింది… మిస్టర్ అహ్మద్ బావిలోని నీటి జాడలను కనుగొనెందుకు ఒక వ్యక్తిని లోపలికి దించాడు..ఆ వ్యక్తికి బావిలోని నీరు గొంతు వరకు వచ్చాయి..నీరు ఎటువైపు నుండి వస్తున్నాయి అని కనుగొనెందుకు ఆ వ్యక్తి నీటిలో అటు ఇటు తిరగటం ప్రారంభించాడు.కానీ అతనికి ఎక్కడ నుండి నీరు వస్తుందో తెలుసుకోవటం అంత ఈజీ కాదు అనిపించింది..ఎందుకంటే ఆ నీరు అన్నీవైపులా సమాన ప్రవాహంతో కదులుతోంది..పైగా ఆ నీటిలో తల ముంచేందుకు అనుమతి లేనందున అతను అది చేయలేకపోయాడు..
మిస్టర్ అహ్మద్ మరో ఆలోచన ఆలోచించాడు. జమ్జమ్ నీటిని పెద్ద పంపుల ద్వారా తొడటం వల్ల నీరు అందులో నీటిమట్టం తగ్గితే ఆ ఊట నీరు ఎక్కడనుండి వస్తుందో తెలుసుకోవచ్చని భావించాడు..దీంతో వారు వెంటనే పంపుల సహాయంతో నీటిని తొడటం ప్రారంభించారు..ఒక మనిషిని ఒకే చోట నిశ్చలంగా నిలబడి, బావి లోపల జరిగే ఏదైనా అసాధారణమైన విషయాన్ని జాగ్రత్తగా గమనించమని సూచించడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.. కొద్దిసేపటి తర్వాత, బావిలో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చేతులు పైకెత్తి గట్టిగ కేకలు వేయటం ప్రారంభించాడు..
“అల్హమ్దులిల్లా! నేను నీటి జాడను కనుగొన్నాను అని..అతను బావిలో నిల్చున్నప్పుడు అతని పాదాల కింద ఉన్న ఇసుక నుండి నీరు ఉబుకుతున్నట్లు అతను గుర్తించాడు..బావి సమాన వైశల్యంలో నీరు ఉబుకుతున్నట్లు గ్రహించాడతడు..బావిలోని నీటి ప్రవాహం ప్రతి పాయింట్ వద్ద సమానంగా ఉంది..దీంతో ఇందులో నీటి స్థాయి స్థిరంగా ఉంటుంది..Mr. అహ్మద్ తన పరిశీలనలను ముగించిన తర్వాత, అతను పరీక్షించడానికి యూరోపియన్ ప్రయోగశాలలకు నీటి నమూనాలను తీసుకున్నాడు. అతను కాబా నుండి బయలుదేరే ముందు, అతను మక్కా చుట్టూ ఉన్న బావుల గురించి కూడా అధికారులకు ఆరా తీశాడు..ఆ బావులు చాలా వరకు ఎండిపోయాయని వారు చెప్పారు.
యూరోపియన్ ప్రయోగశాలలు పరీక్షించిన నీటి నమూనాల ఫలితాలు మరియు జెడ్డా ప్రయోగశాలలో విశ్లేషించబడినవి దాదాపు ఒకేలా రిపోర్ట్ రావటంతో..చివరగా, జెడ్డా మరియు యూరోపియన్ ప్రయోగశాల యొక్క వ్యాఖ్యలు జమ్జమ్ తాగడానికి అనువైనవే కాకుండా వాటి గొప్ప లక్షణాలను కూడా వెల్లడించాయి. అందువల్ల ఈజిప్టు వైద్యుడు చేసిన ప్రకటన తప్పు అని నిరూపించబడింది. ఈ నివేదికపై చాలా సంతోషించిన రాజు ఫైజల్ యూరోపియన్ ప్రెస్‌లో వచ్చిన నివేదిక యొక్క వైరుధ్యాన్ని ఆదేశించాడు..
అసమాన ప్రదేశాలలో నీటి రుచి భిన్నంగా ఉంటుంది. కానీ జమ్ జమ్ నీటి రుచి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది…ఇందులో ఎలాంటి మార్పు ఉండదు..అంతేకాదు..సాధారణ నీటిలో వలె ఇందులో ఎటువంటి హానికర బ్యాక్టీరియా, జీవం అభివృద్ధి జరగదు..నగరాల్లోని ట్యాంకుల్లోకి పంప్ చేసిన నీటిలో బ్యాక్టీరియాను నాచును నాశనం చేసేందుకు వివిధ కెమికల్స్ ని వాడతారు..కానీ ఇందులో ఎటువంటి కెమికల్ మిక్సీంగ్ లేకున్నా కూడా ఇది చాలా స్వచ్చంగా ఉంటుంది ఎలాంటి నాచుని అభివృద్ధి చేయదు..సంవత్సరాలు నిలువ ఉంచినా ఈ నీరు చెడిపోదు…ఎంత వీక్ గా ఉన్నవారు కూడా ఇవి తాగగానే చురుకుగా కనిపిస్తారు..ఈ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ శరీరాని మంచి చేసే ఫ్లోరైడ్..సో..యూరో సైన్టిస్టులు సైతం ఈ నీరు తాగడానికి అనువైనవిగా గుర్తించారు…ఈ నీరు నాచు పట్టినట్లు..చెడిపోయినట్లు దాకలాలు లేవు..





